ఇలా చేసి చూడండి!
ABN , First Publish Date - 2021-03-28T05:43:25+05:30 IST
పేస్ట్రీలు చేసేటప్పుడు ఫ్రీజర్‌లో ఉంచిన వెన్నను తురిమి ఆ పిండిలో వేస్తే అందులో తొందరగా కలిసిపోతుంది
- పేస్ట్రీలు చేసేటప్పుడు ఫ్రీజర్‌లో ఉంచిన వెన్నను తురిమి ఆ పిండిలో వేస్తే అందులో తొందరగా కలిసిపోతుంది.
- మిగిలిపోయిన ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా కాఫీని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్‌లో ఉంచితే తాగాలనుకున్నప్పుడు పలుచగా చేయకుండానే వాటితో ఐస్ కాఫీ చేసుకుని తాగొచ్చు.
- అరటిపళ్లపై ఉండే తొక్కను తీసేసి ఫ్రీజర్‌లో ఉంచి వాటిని స్మూదీల్లో వేసుకుంటే స్మూదీ ఎంతో టేస్టీగా ఉంటుంది.
- సిట్రస్ పండ్లు, టొమాటోలు, వెన్న, చాక్లెట్లను గది ఉష్ణోగ్రతలో ఉంచితేనే రుచిగా ఉంటాయి.
- మీరు తిన్న ఆహారపదార్థాల వాసన చేతులను వదలకుండా ఉంటే ఉప్పుతో చేతులను కడిగేసుకోవాలి. స్టీల్ కుళాయిపై మీ చేతులను పెట్టి బాగా రుద్దితే కూడా చేతులకు అంటిపెట్టుకుని ఉన్న వాసన పోతుంది.
- అరటిపండ్లను ఇతర పళ్లతో కలపకుండా విడిగా ఉంచితే తొందరగా పాడవవు.