ఘనంగా ఉపరాష్ట్రపతి మనవరాలి వివాహం హాజరైన ఏపీ గవర్నర్‌, కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-02-11T08:40:40+05:30 IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం గురువారం తిరుమలలో ఘనంగా జరిగింది. పుష్పగిరి మఠంలో ఉదయం 11గంటలకు జరిగిన దీప...

ఘనంగా ఉపరాష్ట్రపతి మనవరాలి వివాహం హాజరైన ఏపీ గవర్నర్‌, కిషన్‌రెడ్డి

తిరుమల, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం గురువారం తిరుమలలో ఘనంగా జరిగింది. పుష్పగిరి మఠంలో ఉదయం 11గంటలకు జరిగిన దీప, వెంకటరావు దం పతుల కుమార్తె సుష్మ, కిషన్‌ల వివాహానికి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, బీజేపీ నాయకులు సత్యానంద్‌, విష్ణువర్థన్‌రెడ్డి, భానుప్రకా్‌షరెడ్డి, సత్యన్న, సినీనటుడు రాజేంద్రప్రసాద్‌, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కాగా, ఉదయం వెంకయ్యనాయుడు వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. 


ఏడాదిలో ఒక్కరోజే దర్శనానికి రావాలి

‘ఉన్నత పదవుల్లో ఉన్నవారికి శ్రీవారిని దర్శించుకునే గౌరవాన్ని టీటీడీ కల్పించింది. ఇటువంటి వారం తా ఏడాదిలో ఒక్కరోజే స్వామివారిని దర్శించుకుంటే అందరికీ అవకాశం వస్తుంది. ఈ నియమాన్ని నేను పెట్టుకున్నాను’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీటీడీ యాజమాన్యం భక్తులకు మంచి ఏర్పాట్లు చేస్తోందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ?

Updated Date - 2022-02-11T08:40:40+05:30 IST