టీఎస్‌ఆర్‌జెసి -సెట్‌-2020 దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-08-04T21:50:55+05:30 IST

తెలంగాణ గురుకుల(టీఎస్‌ఆర్‌జెసి) జూనియర్‌ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం (ఇంగ్లీస్‌మీడియం- ఎంపిసి/బిపిసి/ఎంఈసీ)లో ప్రవేశ పరీక్ష కోసం

టీఎస్‌ఆర్‌జెసి -సెట్‌-2020 దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణ గురుకుల(టీఎస్‌ఆర్‌జెసి) జూనియర్‌ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం (ఇంగ్లీస్‌మీడియం- ఎంపిసి/బిపిసి/ఎంఈసీ)లో ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తుచేస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. రాష్ట్రంలోని 35 తెలంగాణ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశ కొరకు జరిగే టీఎస్‌ఆర్‌జెసి-సెట్‌-2020 ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవడానికి చివరి తేదీ 5-08-2020 నుంచి 20-08-2020 వరకు ప్రభుత్వం పొడిగించింది. అలాగే పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారన్నది తేదీని త్వరలోనే తెలియజేస్తామని అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్‌నెం. 040-24734899కు గానీ 9490967222కు  సంప్రదించ వచ్చు. 

Updated Date - 2020-08-04T21:50:55+05:30 IST