వ్యాక్సిన్‌ సేకరణకు నోడల్‌ ఏజెన్సీగా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ

ABN , First Publish Date - 2021-05-07T10:08:50+05:30 IST

రాష్ట్రంలో 18-44 మధ్య వయస్కులకు వ్యాక్సిన్‌ సేకరణ కోసం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి

వ్యాక్సిన్‌ సేకరణకు నోడల్‌ ఏజెన్సీగా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ

డోసులు పంపాలని ఉత్పత్తి కంపెనీలకు లేఖ


హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 18-44 మధ్య వయస్కులకు వ్యాక్సిన్‌ సేకరణ కోసం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ)ను ఎంపిక చేసింది. 18-44 మధ్య వయసున్న వారికి కేంద్ర ప్రభుత్వం మే నెలకి 3.9 లక్షల వ్యాక్సిన్‌ డోసులు కేటాయించింది. ఇందులో కొవిషీల్డ్‌ 2,90,010 డోసులు, కొవాగ్జిన్‌ 1,00,580 డోసులు తెలంగాణకు ఇవ్వనున్నట్లు ఏప్రిల్‌ 29న రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో ఆ వయసున్న వారికి రెండు డోసులు కలిపి 3.05 కోట్లు కావాలి. కేంద్రమిచ్చే డోసులు ఏమాత్రం సరిపోవని తెలంగాణ సర్కారు అంటోంది. మరోవైపు కేంద్రం కేటాయించిన డోసులను వెంటనే రాష్ట్రానికి పంపాలని టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఉత్పత్తి కంపెనీలకు మే 3న లేఖ రాసింది. 

Updated Date - 2021-05-07T10:08:50+05:30 IST