టీఎ‌స్‌పీఏ వద్ద ఎన్పీఏ తరహా భద్రత

ABN , First Publish Date - 2020-07-05T07:50:49+05:30 IST

రాజ్‌బహదూర్‌ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శిక్షణ కేంద్రం (ఆర్బీవీఆర్‌ఆర్‌ టీఎ్‌సపీఏ) వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

టీఎ‌స్‌పీఏ వద్ద ఎన్పీఏ తరహా భద్రత

  • డైరెక్టర్లు సహా అందరికీ ఒకే ప్రవేశ ద్వారం

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాజ్‌బహదూర్‌ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శిక్షణ కేంద్రం (ఆర్బీవీఆర్‌ఆర్‌ టీఎ్‌సపీఏ) వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటి వరకు అకాడమీకి వచ్చే సందర్శకులపై పెద్దగా ఆంక్షలు లేవు. పగలు, రాత్రి అనే తేడా లేకుం డా ఎవరిష్టం వచ్చినట్లు వారు వచ్చి వెళ్తున్నారు. అకాడమీలో పెద్దఎత్తున ఉన్న భద్రతా లోపాలపై నూతన డైరెక్టర్‌ ఇప్పుడు దృష్టి సారించారు. ఎన్పీఏ తరహాలో కట్టుదిట్టమైన భద్రత ఉండేలా చర్యలు తీసుకున్నారు. అకాడమీని సందర్శించే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచడంతో పాటు వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు.


అకాడమీకి రెండో వైపు (నైరుతి వైపు) ఉన్న మార్గాన్ని భద్రతా కారణాల దృష్ట్యా బారికేడ్లతో పూర్తిగా మూసివేశారు. ఇప్పటి వరకు కేవలం డైరెక్టర్‌, జా యింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులు మాత్రమే ఉపయోగించి న ప్రధాన ద్వారాన్నే ఇప్పుడు అందరూ ఉపయోగిస్తున్నారు.   అకాడమీలో సిబ్బందితోపాటు, బయటి వారి కోసం బ్యాంకు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రెండో మార్గం ద్వారా బ్యాంకుకు వచ్చే వారిని అనుమతించారు. ఇప్పుడు ఆ మార్గా న్ని మూసివేయడంతో అందరూ ప్రధాన ద్వారాన్నే ఉపయోగిస్తున్నారు. బ్యాంకు ఖాతా ఉన్న వారికి అకాడమీ అధికారులు ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తున్నారు.  


వాస్తు కారణమే!

వాస్తు ప్రకారం నైరుతి వైపు ద్వారం ఉండడం సరైంది కాదని చెబుతారు. అకాడమీలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై వాస్తు దోషాల ప్రభావం కూడా ఉందనే ప్రచారం జరిగింది. భద్రతా కారణాలు, వాస్తు అంశాల్ని పరిగణలోకి తీసుకుని నైరుతి వైపు ఉన్న రెండో ద్వారాన్ని  అధికారులు పూర్తిగా మూసివేశారు.

Updated Date - 2020-07-05T07:50:49+05:30 IST