Abn logo
Sep 20 2021 @ 19:48PM

టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ బాధ్యతలు

హైదరాబాద్: బస్ భవన్‌లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి , ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి , గణేష్ గుప్తా, ముఠా గోపాల్ ఎమ్మెల్సీ విజీ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత , నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ విఠల్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. 


కాగా నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం చీమన్‌పల్లికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్‌ 1973 నుంచి పోలీస్‌ పటేల్‌గా సేవలందించారు. 1981లో చీమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1986లో  సిరికొండ మండలాధ్యక్షుడిగా, 1999లో కాంగ్రెస్‌ తరఫున ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో   బాన్సువాడ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.


ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి 2014లో నిజామాబాద్‌ (రూరల్‌) నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2018లో సైతం  అదే నియోజకవర్గం నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా  గెలుపొందారు. కాగా, తనను ఆర్టీసీ చైర్మన్‌గా నియమించడంపై బాజిరెడ్డి.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు

ఇవి కూడా చదవండిImage Caption