న్యూజీల్యాండ్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు!

ABN , First Publish Date - 2021-03-05T02:33:08+05:30 IST

న్యూజీల్యాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవర్జామున భూకంపం చోటుచేసుకున్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తాజాగా ప్రకటించింది. భూకంప తీవ్రతను తొలుత 7.3గా పేర్కొన్న సంస్థ..ఆ తరువాత దీన్ని 6.9కి కుదించింది.

న్యూజీల్యాండ్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు!

ఆక్‌ల్యాండ్: న్యూజీల్యాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవర్జామున భూకంపం చోటుచేసుకున్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తాజాగా ప్రకటించింది. భూకంప తీవ్రతను తొలుత 7.3గా పేర్కొన్న సంస్థ..ఆ తరువాత దీన్ని 6.9కి కుదించింది.  న్యూజీల్యాండ్ తీరప్రాంత నగరం గిస్‌బార్న్‌కు  ఈశాన్యాన 180 కిలోమీటర్ల దూరంలో, 10 లోతున భుకంప కేంద్రం ఉన్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరం వరకూ సునామీ ప్రమాదం ఉందని అని హవాయ్‌లోని సునామీ హెచ్చరికల కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. తీర ప్రాంతాల్లో భూమి కంపిచనట్టైతే అక్కడున్న వారు తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి అని జాతియ ఎమర్జెన్సీ నిర్వహణ ఏజెన్సీ న్యూజీల్యాండ్ ప్రజలకు సూచించింది. 

Updated Date - 2021-03-05T02:33:08+05:30 IST