Advertisement
Advertisement
Abn logo
Advertisement

గరుడ వారధిని అలిపిరి దాకా పొడిగిస్తాం: టీటీడీ చైర్మన్

తిరుమల: గరుడ వారధిని అలిపిరి దాకా పొడిగిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రేపటి పాలకమండలి సమావేశంలో దీనికి ఆమోదం తెలుపుతామని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా కల్యాణమస్తు కార్యక్రమాన్ని మేలో పునః ప్రారంభించలేక పోయామని, త్వరలోనే ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ధర్మ ప్రచారంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్టీ, ఎస్సీ, బీసీ, మత్స్యకార గ్రామాల్లో 500 ఆలయాలు నిర్మించే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. 

కరోనా కారణంగా నిలిచిపోయిన దర్శనాలు సంఖ్య పెంపు పై రేపటి పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కోవిడ్ నుంచి భక్తులను రక్షించాలని స్వామి వారిని ప్రార్థిస్తూ ఏడాదిన్నర కాలంగా తిరుమలలో అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించామని సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ వల్ల కొన్ని నిర్ణయాలు అమలు చేయలేక పోయామని  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 


Advertisement
Advertisement