నేడు టీటీడీ పాలకమండలి భేటీ

ABN , First Publish Date - 2020-05-28T13:51:01+05:30 IST

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. లాక్‌డౌన్ నేపధ్యంలో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశాన్ని

నేడు టీటీడీ పాలకమండలి భేటీ

తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. లాక్‌డౌన్ నేపధ్యంలో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించనున్నారు. తిరుమల నుంచి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, 10 మంది సభ్యులు హాజరు కానున్నారు. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా 26 మంది సభ్యులు పాల్గొననున్నారు. 63 ఆంశాలతో కూడిన ఆజెండాపై పాలకమండలి చర్చించనుంది. 


శ్రీవారి దర్శనానికి భక్తులను ఎప్పటి నుంచి అనుమతించాలనే ఆంశంతో పాటు దర్శన విధివిధానాల అమలుపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. గత కొద్ది రోజులుగా టీటీడీని కుదిపేస్తున్న ఆస్తుల విక్రయాల అంశంపై కూడా ప్రధానంగా చర్చించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడి ఈవో నేతృత్వంలో ఓ కమీటిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 


ఆర్థిక లోటు నేపధ్యంలో ఉద్యోగుల జీతాల చెల్లింపుకు ఫిక్సడ్ డిపాజిట్‌పై 300 కోట్లు ఓడి తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అలాగే 26 ఇంజనీరింగ్‌ పనులకు సంబంధించి అనుమతులు మంజూరు, ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో గరుడ వారధికి నిధులు కేటాయింపు లేనట్లే తెలుస్తోంది. సుందరీకరణ చేసిన అవిలాల చెరువు తుడాకి అప్పగించే అవకాశం ఉంది. టీటీడీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ స్థాయికి సంబంధించి 47 పోస్టులు భర్తీ, కొనుగోళ్ళు, ఎఫ్.ఎం.ఎస్, యస్డీ కౌంటర్ల  టెండర్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సేవా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో కేటాయిస్తున్న నేపధ్యంలో దేశ వ్యాప్తంగా నిరుపయోగంగా మారిన 75 ఈ దర్శన కౌంటర్లను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2020-05-28T13:51:01+05:30 IST