Abn logo
Sep 24 2021 @ 12:02PM

టీటీడీకి జియో ఉచితంగా సేవలందిస్తోంది: టీటీడీ

తిరుమల: శ్రీవారి భక్తులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు ఇచ్చే సమయంలో టీటీడీ వెబ్ సైట్‌లో సాంకేతిక సమస్యలు ఉన్న కారణంగా జియోతో ఒప్పందం కుదుర్చుకున్నామని టీటీడీ తెలిపింది. జియో టీటీడీకి ఉచితంగా సేవలందిస్తోందని పేర్కొంది. దీంతో భక్తులు ఆన్‌లైన్లో సులభంగా టిక్కెట్లను పొందారని టీటీడీ తెలిపింది. దాదాపు రెండు లక్షలకు పైగా టిక్కెట్లను భక్తులు ఇప్పటికే కొనుగోలు చేశారని...వెబ్‌సైట్‌లో ఉన్న చిన్న పాటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని టీటీడీ వెల్లడించింది. 

ఇవి కూడా చదవండిImage Caption