Abn logo
Sep 22 2021 @ 03:26AM

వెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉమాదేవి మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ఆమెకు.. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశ్వీచనం, అధికారులు ప్రసాదాలు అందజేశారు.