రద్దయిన నోట్ల మార్పిడికి అవకాశమివ్వండి!

ABN , First Publish Date - 2020-07-14T06:59:57+05:30 IST

తిరుమల శ్రీవారికి గతంలో భక్తులు సమర్పించిన ‘రద్దయిన నోట్ల’ మార్పిడికి అనుమతించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వినతి పత్రం సమర్పించారు...

రద్దయిన నోట్ల మార్పిడికి అవకాశమివ్వండి!

  • టీటీడీలో రూ.50 కోట్ల విలువైన పాతనోట్లు
  • కేంద్ర మంత్రి నిర్మలకు టీటీడీ చైర్మన్‌ వైవీ వినతి

న్యూఢిల్లీ, జూలై 13(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి గతంలో భక్తులు సమర్పించిన ‘రద్దయిన నోట్ల’ మార్పిడికి అనుమతించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వినతి పత్రం సమర్పించారు. మొత్తం రూ.50 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్ద ఉన్నాయని  తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల ఆదాయం తగ్గి టీటీడీ నిర్వహణ కష్టంగా మారిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు, ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా వెనుకబడిన ఏడు జిల్లాల సమగ్రాభివృద్ధికి కేంద్రం నుంచి రావలసిన పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని కోరారు. 


Updated Date - 2020-07-14T06:59:57+05:30 IST