Abn logo
Jul 7 2021 @ 13:09PM

జగన్ సర్కార్‌పై టీటీడీ రిటైర్డ్ ఉద్యోగుల ఆగ్రహం

తిరుపతి: జగన్ సర్కార్‌పై టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇచ్చిన ప్లాట్స్‌ను జగన్ లాకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ పరిపాలన భవనం సమీపంలో బుధవారం జరిగిన రిటైర్డ్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి వందలాది మంది హాజరయ్యారు. 2007లో టీటీడీ ఇచ్చిన ప్లాట్స్‌ను బిడ్డలకు పెళ్లి కానుకగా రాసిచ్చిన ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సుప్రీంకోర్టులో ఉండగానే రహస్యంగా చివరి పాలకమండలి సమావేశంలో ప్లాట్స్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశారన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగుల సమావేశానికి టీటీడీ ఉద్యోగ సంఘo నేతలు సంఘీభావం తెలిపారు.

TAGS: tirumala TTD

క్రైమ్ మరిన్ని...