తిరుమల శ్రీవారి పూజా కైంకర్యాలపై Supreme courtలో విచారణ

ABN , First Publish Date - 2021-11-16T16:56:32+05:30 IST

తిరుమల శ్రీవారి పూజా కైంకర్యాలపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.

తిరుమల శ్రీవారి పూజా కైంకర్యాలపై Supreme courtలో విచారణ

న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి పూజా కైంకర్యాలపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తిరుమల దేవస్థానంలో శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తోసిపుచ్చింది. పూజకార్యక్రమాలను ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని గతంలో టీటీడీ అఫిడవిట్ దాఖలు చేసింది. పిటీషనర్ కేవలం ప్రచారం కోసమే వస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆలయ రోజువారీ వ్యవహారాలు రాజ్యాంగ న్యాయస్థానం పరిధిలోకి రావని ఉన్నతన్యాస్థానం తేల్చిచెప్పింది. శ్రీవారికి జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో అభ్యంతరాలుంటే టీటీడీ యజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలని పేర్కొంది. అలాగే పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని టీటీడీ సుప్రీంకోర్టు తెపింది.  స్వామివారికి పూజా కైంకర్యాలపై టీటీడీకి చెప్పినా యాజమాన్యం పట్టించుకోకపోతే సరైన ఫోరంను  ఆశ్రయించాలని పిటిషనర్‌కు సుప్రీం కోర్టు సూచనలు చేసింది. 

Updated Date - 2021-11-16T16:56:32+05:30 IST