Abn logo
Sep 24 2021 @ 15:53PM

టీటీడీ టికెట్లు అని కొడితే అది జియోమార్టుకు వెళ్లింది: రఘురామ

ఢిల్లీ: టీటీడీ టికెట్లు అని కొడితే అది జియోమార్టుకు వెళ్లిందని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల కోసం తమ ప్రభుత్వం కన్ను ఎయిడెడ్ విద్యాసంస్థలపై పడిందన్నారు. ఎందరో ప్రముఖులు విజయవాడ మాంటిస్సోరిలో చదివారని గుర్తుచేశారు. కేవలం భూదాహంతో చేస్తున్న స్థలయజ్ఞం ఇదని తప్పుబట్టారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. ఆచంటలో టీడీపీ, జనసేన కలిసి ఎంపీపీ, వైస్‌ఎంపీపీ పదవులు కైవసం చేసుకోవడం స్థానిక సర్దుబాటు చేసుకున్నాయని తెలిపారు. మద్యంపై వచ్చే ఆదాయంపై లోన్స్ కూడా తీసుకుంటున్నారని, ఏ ప్రాతిపదికన దిక్కుమాలిన బ్రాండ్లు రాష్టంలో తీసుకొచ్చారని తప్పుబట్టారు. క్వాలిటీ మద్యం 2 బాటిల్స్ ఎవరైనా తెచ్చుకుంటే కేసులు పెడుతున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు.


ఇవి కూడా చదవండిImage Caption