మీటర్లంటే రైతు మెడకు ఉరితాళ్లు వేయడమే..తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-06-15T08:31:18+05:30 IST

‘‘వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడమంటే రైతుల మెడకు ఉరితాళ్లు బిగించడమే. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒత్తిడికి తలొగ్గి ‘మీటర్లు’ బిగించొద్దు. అర శాతం అప్పుకోసం అన్నదాతల గొంతు కోస్తారా?’’ అని

మీటర్లంటే రైతు మెడకు ఉరితాళ్లు వేయడమే..తులసిరెడ్డి

అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ‘‘వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడమంటే రైతుల మెడకు ఉరితాళ్లు బిగించడమే. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఒత్తిడికి తలొగ్గి ‘మీటర్లు’ బిగించొద్దు. అర శాతం అప్పుకోసం అన్నదాతల గొంతు కోస్తారా?’’ అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి, సీఎం జగన్మోహన్‌రెడ్డిని నిలదీశారు. ఆయన సోమవారం ఒక ప్రకటన చేశారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తును ఎత్తివేసే పన్నాగం ఇదని ఆరోపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కాంగ్రెస్‌ మానస పుత్రికలాంటి పథకమన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి పెట్టిన తొలి సంతకం ఉచిత విద్యుత్తు పథకంపైనే అని గుర్తు చేశారు. ‘రైతు ఏడ్చిన రాజ్యం... ఎద్దు ఈడ్చని సేద్యం’ బాగుపడవని హితవు పలికారు. రైతుల కోపాగ్నికి గురికాకముందే మీటర్లను ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి కోరారు. 

Updated Date - 2021-06-15T08:31:18+05:30 IST