Abn logo
Sep 22 2021 @ 16:10PM

మాటలు ఎక్కువ చేతలు తక్కువ: తులసిరెడ్డి

అమరావతి: టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జీ.ఓను సస్పెండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. మద్యం షాపులు, పెన్షన్లకు  సంబంధించి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారనే కారణంతో శాసనసభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడులకు అసెంబ్లీలో మైక్ కట్ చేయాలని అసంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదని చెప్పారు. కొనే నాధుడు లేక రైతులు లబోదిబోమంటున్నారని చెప్పారు. రైతుల విషయంలో జగన్ ప్రభుత్వానివి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని విమర్శించారు.