Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ ప్రభుత్వానివి పిట్టల దొర కోతలే: తులసిరెడ్డి

విజయవాడ: పేదల ఇళ్ల నిర్మాణంపై జగన్ ప్రభుత్వానివి పిట్టల దొర కోతలేనని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం ఇచ్చేది రూ.1.80 లక్షలని, ఇసుక సిమెంట్, స్టీల్, కూలి ధరలు పెరిగిన కారణంగా ఒక్కొక్క ఇంటికి కనీసం రూ.3.50 లక్షలవుతుందన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి రూ.3.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.3,671 కోట్లు కేటాయించి రూ.964 కోట్లు (27 శాతం) ఖర్చు చేసిందన్నారు. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో రూ.3,692 కోట్లు కేటాయించి రూ.1,510 కోట్లు (41 శాతం) ఖర్చు చేసిందని, ఈ ఆర్థిక సంవత్సరం 2021-2022 బడ్జెట్‌లో రూ.4,715 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కానీ ఈ రోజు ప్రకటనల్లో 2022 జూన్ నాటికి రూ.28,084 కోట్లతో 15,60,227 ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పిందని, బడ్జెట్ కేటాయింపులే రూ.4,715 కోట్లు కాగా, రూ.28,084 కోట్లు ఖర్చు చేస్తామనడం పిట్టల దొర కోతలు కాదా..? అని తులసిరెడ్డి ప్రశ్నించారు.

Advertisement
Advertisement