తులసి వెరసి...

ABN , First Publish Date - 2020-02-11T05:30:00+05:30 IST

తాజా ఆకుల కషాయం లేదా శీతల కషాయం, ఆకుల ఎండుపొడి, పచ్చి ఆకులు నమలడం, పచ్చి ఆకులను నెయ్యి, తేనె, అల్లపురసం వంటి వాటితో..

తులసి వెరసి...

సంప్రదాయ వైద్య విధానంలో తులసిని విరివిగా ఉపయోగిస్తారు. కీటకనాశని, విషహారిణిగా కూడా తులసి ఉపయోగపడుతుంది. తులసితో ఉన్న ప్రయోజనాలు కోకొల్లలు!


ఉపయోగించే విధానాలు: 

తాజా ఆకుల కషాయం లేదా శీతల కషాయం, ఆకుల ఎండుపొడి, పచ్చి ఆకులు నమలడం, పచ్చి ఆకులను నెయ్యి/తేనె/అల్లపురసం వంటి వాటితో కలిపి వాడడం, వాడుకలో ఉంది. తులసిని హెర్బల్‌ టీగా కూడా ఉపయోగిస్తారు. తులసి పంచభాగాల చూర్ణాన్ని కూడా ఔషధంగా వాడతారు. తులసి ఆకుల రసం మర్దన చేయడం మరొక చికిత్సా విధానం. తులసిని ఇతరత్రా పదార్థాలతో కలిపి పలు చికిత్సల్లో ఉపయోగిస్తారు. 


కీటకహారిణి, నొప్పి నివారిణి

తులసి ఆకుల నుంచి యుజెనాల్‌ అనే నూనె వాతావరణంలో కలుస్తూ ఉంటుంది. ఇది క్రిమికీటకాదులను, బ్యాక్టీరియాను పారదోలుతుంది. తద్వారా వాతావరణం శుభ్రపడుతుంది. పలు ఔషధాలలో నొప్పి నివారిణిగా దీన్నే వాడుతున్నారు. ఇదే రసాయనం కలిగి ఉండే తులసి కూడా నొప్పినివారిణిగా పేరు తెచ్చుకుంది. 


గుండెకు అండ

తులసి అనేక గుండె వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. గుండెనొప్పి, ఎథిరోస్క్లెరోసిస్‌ ఈ పరిధిలోకి వస్తాయి. తులసి రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ పలు రకాల గుండె జబ్బులకు మూల కారణం. కాబట్టి గుండెకు రక్షణ కల్పించే ఔషధంగా తులసిని ఉపయోగించవచ్చు.

Updated Date - 2020-02-11T05:30:00+05:30 IST