Advertisement
Advertisement
Abn logo
Advertisement

మోదీజీ..తుమ్ సలామత్ రహో ఖయామత్ తక్...

పంజాబ్ సీఎం చన్నీ ఆకాంక్ష...వర్చువల్ సమావేశంలో షాయరీ

చండీఘడ్: పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ ఘటనపై పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ విచారం వ్యక్తం చేశారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎంలతో జరిపిన కొవిడ్ సమీక్షా సమావేశంలో సీఎం చన్నీ మాట్లాడారు. వర్చువల్ సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ జనవరి 5న తన రాష్ట్రంలో జరిగిన భద్రతా లోపంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ‘షాయరీ’ (పద్యాన్ని) పఠించారు.‘‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి మోదీజీ... మీరు పంజాబ్‌కు వచ్చారు, మీ పర్యటనలో జరిగిన దానికి మేం చింతిస్తున్నాం. నేను మీ కోసం ఒక షాయారీని చెప్పాలనుకుంటున్నాను. ‘తుమ్ సలామత్ రహో ఖయామత్ తక్, ఔర్ ఖుదా కరే కి ఖయామత్ నా హో' (ప్రపంచం అంతమయ్యే వరకు మీరు సురక్షితంగా ఉండండి,ప్రపంచం అంతం కాకుండా ఉండనివ్వండి)’’ అని చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు.

పంజాబ్‌ రాష్ట్రంలో ఇటీవల దాదాపు 20 నిమిషాల పాటు రైతులు నిరసన తెలపడంతో ఫ్లైఓవర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌తో ఇరుక్కుపోయారు. హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి, ర్యాలీలో ప్రసంగించడానికి ప్రధాని ఫిరోజ్‌పూర్‌కు వెళుతుండగా ఆయన మార్గాన్ని రైతులు అడ్డుకున్నారు.చివరకు కాన్వాయ్‌ వెనక్కి వెళ్లడంతో ర్యాలీని రద్దు చేశారు.మోదీ పర్యటనలో భద్రతా ఉల్లంఘన పెద్ద రాజకీయ వివాదంగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ సాగుతోంది.గురువారం జరిగిన కొవిడ్ మీట్‌లో  ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చన్నీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement