Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘తాండవ’ రైతుల బకాయిలు చెల్లించాలి

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు

తుని డిసెంబరు 3: తాండవ సహకార చక్కెర కర్మాగారానికి గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు పేమెంట్లు చేయడంతోపాటు కార్మికులకు ఇవ్వాల్సిన జీతాల బకాయిలను ఫ్యాక్టరీ యాజమ్యానం తక్షణం చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు డిమాండ్‌ చేశారు. తాం డవ షుగర్స్‌ గేటు ఎదుట ఏపీ రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం చెరకు రైతులు, కార్మికులు నిరసన దీక్ష నిర్వహించి వంటా వార్పూ చేశారు. నరసింగరావు మాట్లాడుతూ 4 నియోజకవర్గాల చెరకు రైతులు జీవనాధారంగా భావించే తాండవ షుగర్స్‌ను అన్నివిధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు సకాలంలో బిల్లులు, కార్మికులకు జీతాలు చెల్లించకపోతే వారి కుటుంబాలు ఎలా బతుకుతాయని ఆలోచించడం లేదన్నారు. ప్రభుత్వం బకాయిలు వెంటనే చెల్లించాలని, 2021-22 సీజన్‌కు ఫ్యాక్టరీ నడిపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఈనెల23న జాతీయ రహదారిని దిగ్బంధిస్తామన్నారు. రైతు సంఘం నాయకులు కె.లోకనాధం, నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకులు ఎం.అప్పలరాజు, శేషుబాబ్జీ, కోటేశ్వరరావు, కర్రి అప్పారావు, రాజు, పద్మ, శ్రీను, కార్మిక నాయకులు శ్రీనివాసరావు, రమణ ఉన్నారు.

Advertisement
Advertisement