‘టన్నెల్‌ ఫాల్ట్‌జోన పనులు వేగవంతం చేయాలి’

ABN , First Publish Date - 2021-10-17T05:21:10+05:30 IST

అవుకు టన్నెల్‌ ఫాల్ట్‌జోన పనులు వేగవంతం చేయాలని జలవనరులశాఖ ఇంజనీరింగ్‌ ఇన చీఫ్‌ నారాయణరెడ్డి అన్నారు.

‘టన్నెల్‌ ఫాల్ట్‌జోన పనులు వేగవంతం చేయాలి’

అవుకు, అక్టోబరు 16: అవుకు టన్నెల్‌ ఫాల్ట్‌జోన పనులు వేగవంతం చేయాలని జలవనరులశాఖ ఇంజనీరింగ్‌ ఇన చీఫ్‌ నారాయణరెడ్డి అన్నారు. శనివారం సీఈ మురళీనాథ్‌రెడ్డి, ఎస్‌ఆర్‌బీసీ ఇనచార్జి ఈఈ సంజీవచౌదరి, క్వాలిటీ కంట్రోల్‌ ఈఈలు పురార్థనరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి కాంట్రాక్టర్‌ శ్రీహరితో కలసి టన్నెల్‌ ఫాల్ట్‌జోన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఎనసీ నారాయణరెడ్డి మాట్లాడుతూ టన్నెల్‌ లెఫ్ట్‌కెనాల్‌లో 165 మీటర్లు ఫాల్ట్‌ జోన ఏర్పడిందన్నారు. ఇప్పటి వరకు 55 మీటర్లు ఫాల్ట్‌జోన పనులు చేశారని, మిగిలిన 110 మీటర్లు పనులు వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టరుకు సూచించామన్నారు. ఫాల్ట్‌జోన పనులు పూర్తయితే రెండు సొరంగాల నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించవచ్చాన్నారు. అలాగే గోరుకల్లు నుంచి అవుకు వరకు 57.7 కి.మీ పొడవున గాలేరు నగరి సుజల స్రవంతి కాల్వ లైనింగ్‌ పనులు రూ.916 కోట్లతో చేపట్టామన్నారు. జంట సొరంగాల పక్కనే త్వరలో మూడవ టన్నెల్‌ను రూ. 351 కోట్లతో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సోరంగం పోడవు 5.7 కి.మీ కాగా వ్యాసార్థం 11 మీటర్లు ఉంటుందన్నారు. ఈ సొరంగం నుంచి మరొక 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్బీసీ బనగానపల్లె ఇనచార్జి ఈఈ సుబ్బరాయుడు, డీఈలు చలపతిరెడ్డి, బాబ్జీ, జేఈలు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T05:21:10+05:30 IST