తెల్లవారి నుంచే పడిగాపులు

ABN , First Publish Date - 2021-03-05T06:08:04+05:30 IST

రేషన్‌ లబ్ధిదారులకు ఐరిస్‌, ఓటీపీల టెన్షన్‌ తీరలేదు. రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీకి వేలిముద్రల విధానాన్ని తొలగించి కొత్తగా ఐరిస్‌, మొబైల్‌ఫోన్‌ ఓటీపీ విధానాన్ని తీసుకురావడంతో నెలరోజులుగా లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.

తెల్లవారి నుంచే పడిగాపులు

రేషన్‌ లబ్ధిదారులకు ఇంకా తీరని ఓటీపీ కష్టాలు


తూప్రాన్‌, మార్చి 4: రేషన్‌ లబ్ధిదారులకు ఐరిస్‌, ఓటీపీల టెన్షన్‌ తీరలేదు. రేషన్‌ దుకాణాల్లో సరుకుల పంపిణీకి వేలిముద్రల విధానాన్ని తొలగించి కొత్తగా ఐరిస్‌, మొబైల్‌ఫోన్‌ ఓటీపీ విధానాన్ని తీసుకురావడంతో నెలరోజులుగా లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఆధార్‌కార్డుకు మొబైల్‌ ఫోన్‌ నంబరు లింకు చేసుకునేందుకు నమోదు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆధార్‌కు మొబైల్‌ లింక్‌ చేసేందుకు ఒక్కొక్క కేంద్రంలో రోజుకు 40 మందికే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో తూప్రాన్‌ పట్టణంలోని ఆధార్‌ కేంద్రం, ఓ బ్యాంకు వద్ద గురువారం తెల్లవారగానే బారులు తీరారు. కాగా.. ఒక్కొక్క ఆధార్‌ కేంద్రం వద్ద ఒక్కో రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 




Updated Date - 2021-03-05T06:08:04+05:30 IST