పసుపు రైతు పెదవి విరుపు

ABN , First Publish Date - 2020-06-04T10:25:13+05:30 IST

కేంద్ర ప్రభుత్వం 14 రకాల వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర భారీగా పెంచినప్పటికీ పసుపును పట్టించుకోకపోవడంతో రైతులు అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పసుపు రైతు పెదవి విరుపు

14 రకాల పంటలకు మద్దతు ధర భారీగా పెంచిన కేంద్రం

పసుపును పట్టించుకోని వైనం


ఆర్మూర్‌, జూన్‌2: కేంద్ర ప్రభుత్వం 14 రకాల వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర భారీగా పెంచినప్పటికీ పసుపును పట్టించుకోకపోవడంతో రైతులు అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పసుపు పంటకు మద్దతు ధ ర కావాలని, బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు భారతదేశం దృష్టికి ఆకర్షిం పజేశారు. వివిధ పార్టీల నాయకులు హామీలు కూడా గుప్పించారు. కానీ ఫలితం కనిపించడంలేదు. బీజేపీ జాతీయ నాయకులు హామీ ఇవ్వడంతో తమ కల నెరవేరుతుందని రైతులు భావించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత రెండు సార్లు పంటలకు మద్దతు ధరలు ప్రకటించినప్పటికీ ప సుపును ప్రస్తావించలేదు.


గత సంవత్సరం అధికారం చేపట్టిన నెల రోజులకే మ ద్దతు ధరలు ప్రకటించినందున సమయం లేక పసుపు గురించి ప్రస్తావించ లేకపోయారని, వచ్చే సంవత్సరం న్యాయం జరుగుతుందని రైతులు భావించారు. కానీ ఈ సారి కూడా మద్దతు ధర, గిట్టుబాటు ధర ప్రస్తావనకు రాలేదు. ఎం ఎస్‌పీ పరిధిలో లేని పంటలకు అదనపు ధర చెల్లిస్తామని, ప్రైస్‌ డెఫిషియెన్సీ పే మెంట్‌ కింద బ్యాంకు జమ చేయాలని మేనిఫెస్టో కమిటీలో నిర్ణయించామని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాదవ్‌ గత సంవత్సరం ఎన్నికల సమ యంలో మార్చి 25న ఆర్మూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. మేని ఫెస్టో కమిటీ చైర్మన్‌, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌ మైదానంలో ఏప్రిల్‌ 2న జరిగిన సభలో మద్దతు ధర ప్రకటిస్తామని, బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 


భారీగా పెరిగిన మద్దతు ధరలు...

కేంద్ర ప్రభుత్వం 14రకాల పంటలకు మద్దతు ధరలు ఈయేడు భారీగా పెం చింది. మూడేళ్లుగా మద్దతు ధరల పెరుగుదల ఆశాజనకంగా ఉంది. గత సం వత్సరం నామమాత్రంగా పెంచినప్పటికీ రెండేళ్ల క్రితం భారీగా పెంచింది. వరికి క్వింటాకు రూ.53, జొన్నలకు రూ.70, సజ్జలకు 150, మక్కలకు రూ.90, కుం దులకు రూ.200, మినుములకు రూ.300, పెసర్లకు రూ.150, వేరుశనగకు రూ. 185, పొద్దు తిరుగుడుకు రూ.235, నువ్వులకు రూ.370, పత్తికి రూ.260, రూ.275 పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటను నియంత్రించగా, కేంద్ర రూ.90మద్దతు ధర పెంచడం గమనార్హం. గతంలో కొద్దికొద్దిగా మద్దతు ధరలుగా పెరగగా, నాలుగైదేళ్లుగా ఆశాజనకంగా పెరుగుతున్నాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని, పెట్టుబడి మీద 50శాతం ఆదాయం రావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచింది.


నాలుగేళ్లలో ప్రభుత్వం ప్రకటించిన పంటల మద్ధతు ధర వివరాలు 

పంట 2017-18 2018-19 2019-20 2020-21

ధాన్యం-ఏగ్రేడ్‌  రూ.1590 రూ.1790 రూ.1835 రూ.1888

ధాన్యం సాధారణ రూ.1550 రూ.1750 రూ.1815 రూ.1868

మొక్కజొన్న  రూ.1425 రూ.1700 రూ.1760 రూ.1850

సోయాబీన్‌ రూ.3050 రూ.3399 రూ.3710 రూ.3880

పత్తి          రూ.4020 రూ.5150 రూ.5255 రూ.5515

పొద్దు తిరుగుడు రూ.4100 రూ.5383 రూ.5650 రూ.5815

Updated Date - 2020-06-04T10:25:13+05:30 IST