నటి శ్రావణి కేసు...బయటపడుతున్న దేవరాజు బాగోతం

ABN , First Publish Date - 2020-09-10T20:55:42+05:30 IST

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులు పోలీసులు విచారణ కొనసాగుతోంది.

నటి శ్రావణి కేసు...బయటపడుతున్న దేవరాజు బాగోతం

హైదరాబాద్: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులు పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న దేవరాజుకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. టిక్‌టాక్‌ను అడ్డుపెట్టుకొని దేవరాజు ఎంతో మంది అమ్మాయిలను తన వెంట తిప్పుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దేవరాజ్ ఓ ప్లే బాయ్‌గా నిర్ధారించారు. పలువురు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపినట్టుగా విచారణలో వెల్లడైంది. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపినట్టుగా తెలుస్తోంది. టిక్‌‌టాక్  వీడియోల ద్వారా ఆ విషయాన్ని  పోలీసులు నిర్ధారించుకున్నారు. అదే మాదిరిగా శ్రావణిని కూడా ప్రేమ పేరుతో ఉచ్చులోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తనతో పాటు మరి కొంతమందితో దేవరాజు ప్రేమాయణం నడిపినట్టు గుర్తించిన శ్రావణి అతడిని దూరం పెట్టింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో శ్రావణి కి సంబంధించిన వీడియో, ఫోటోలను ఆమెకు చూపించడంతో కంగుతిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవరాజును ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 


Updated Date - 2020-09-10T20:55:42+05:30 IST