టీవీ నటి ప్రేక్ష మోహతా ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-05-27T08:01:35+05:30 IST
లాక్‌డౌన్‌తో మరో తార రాలిపోయింది. టీవీ నటి ప్రేక్ష మోహతా (25)సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు.
ఇండోర్ మే 26: లాక్‌డౌన్‌తో మరో తార రాలిపోయింది. టీవీ నటి ప్రేక్ష మోహతా (25)సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరీ దుర్గా వంటి కార్యక్రమాల ప్రాచుర్యం పొందిన ప్రేక్ష ఇండోర్‌లోని తన నివాసంలో ఉరివేసుకున్నారు. కుటుంబ సభ్యు లు మంగళవారం ఈ విషయాన్ని గమనించారు. ఘటన స్థలంలో సూసైడ్‌నోట్ కూడా లభ్యమైంది. కెరీర్ సరైన దిశలో సాగకపోవడం పట్ల నిరాశను ఆమె లేఖలో వ్యక్తం చేసింది.