ఐకమత్యమే మహాబలం

ABN , First Publish Date - 2022-01-18T06:19:59+05:30 IST

ఐకమత్యమే మహాబలమని, గ్రామస్థులందరూ కలిసికట్టుగా జీవించాలని సినీ, టీవీ నటులు గెటప్‌ శ్రీను, ఇమ్మానియేల్‌, ప్రసాద్‌, బాబు అన్నారు

ఐకమత్యమే మహాబలం
సంక్రాంతి సంబరాల్లో అలరించిన టీవీ, సినీ నటులు

ఆకివీడు రూరల్‌ జనవరి 17: ఐకమత్యమే మహాబలమని, గ్రామస్థులందరూ కలిసికట్టుగా జీవించాలని సినీ, టీవీ నటులు గెటప్‌ శ్రీను, ఇమ్మానియేల్‌, ప్రసాద్‌, బాబు అన్నారు. గెటప్‌ శ్రీను స్వగ్రామమైన కళింగ గూడెంలో కళింగ యువ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే 13వ సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నా రు.  ఈ సందర్బంగా నిర్వహించిన పరుగు పందెం, జిలేబీ ఈటింగ్‌, కబడ్డీ, వాలీబాల్‌ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. సర్పంచ్‌ గురువెల్లి అన్నపూర్ణ, వైస్‌ ఎంపీపీ కిల్లి రామకృష్ణ, ఎంపీటీసీ బొడ్డుపల్లి అరుణ, కళింగ యువ సంఘం నాయకులు బొడ్డుపల్లి అప్పనపల్లి, అన్నెపు రంగ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T06:19:59+05:30 IST