Abn logo
Aug 1 2021 @ 07:28AM

సీరియల్‌ చూస్తూ బైక్‌ రైడింగ్‌

                   - సోషల్‌ మీడియా ఆధారంగా జరిమానా 


పెరంబూర్‌(చెన్నై): సీరియల్‌ చూస్తూ మోటార్‌బైక్‌పై వెళ్లిన వ్యక్తిని సోషల్‌ మీడియాలో వెలువడిన దృశ్యాల ద్వారా గుర్తించిన ట్రాఫిక్‌ పోలీసులు అతని నుంచి జరిమానా వసూలు చేశారు. కోయంబత్తూర్‌ గాంధీపురం ఫై ఓవర్‌పై మోటార్‌ బైక్‌పై వెళుతున్న వ్యక్తి బైక్‌ ముందు భాగంగా అమర్చిన స్టాండ్‌కు సెల్‌ఫోన్‌ ఉంచి ఒక సీరియల్‌ చేస్తూ బైక్‌పై వెళుతున్నాడు. ఈ దృశ్యాన్ని వెనుక నుంచి మరో బైక్‌పై వస్తున్న యువకులు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ట్రాఫిక్‌ పోలీసులకు నగర పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ సెంథిల్‌కుమార్‌ ఆదేశించారు. అలాగే, అతని ఆచూకీ తెలపాలని పోలీసులు సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో, సోషల్‌ మీడియాలో వచ్చిన దృశ్యాల ఆధారంగా వాహన నెంబరును విచారించిన పోలీసులు, సదరు వ్యక్తి కన్నప్పన్‌నగర్‌ ప్రాంతానికి చెంది ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ముత్తుస్వామిగా గుర్తించి, అతనికి రూ.1,200 జరిమానా విధించారు.