మార్కెట్లోకి టీవీఎస్‌ రైడర్‌

ABN , First Publish Date - 2021-09-17T07:56:22+05:30 IST

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ మార్కెట్లోకి 125 సీసీ మోటార్‌సైకిల్‌ టీవీఎస్‌ రైడర్‌ను విడుదల చేసింది.

మార్కెట్లోకి టీవీఎస్‌ రైడర్‌

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ మార్కెట్లోకి 125 సీసీ మోటార్‌సైకిల్‌ టీవీఎస్‌ రైడర్‌ను విడుదల చేసింది. డ్రమ్‌ బ్రేక్‌తో కూడిన వేరియంట్‌ ధర రూ.77,500 గా ఉండగా డిస్క్‌ బ్రేక్‌ వేరియంట్‌ ధర రూ.85,469 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. కొత్త బైక్‌తో 125 సీసీ విభాగంలో గట్టి పట్టును చేజిక్కించుకోవచ్చని కంపెనీ భావిస్తోంది. కాగా ఈ నెలలోనే 125 సీసీ జూపీటర్‌ స్కూటర్‌ మోడల్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకురానుంది. 

Updated Date - 2021-09-17T07:56:22+05:30 IST