టీవీఎస్ శ్రీచక్ర డైరెక్టర్ విజయరాఘవన్ కన్నుమూత

ABN , First Publish Date - 2020-07-09T15:09:12+05:30 IST

టీవీఎస్ శ్రీచక్ర డైరెక్టర్ విజయరాఘవన్ గుండెపోటుతో మరణించారు.....

టీవీఎస్ శ్రీచక్ర డైరెక్టర్ విజయరాఘవన్ కన్నుమూత

చెన్నై (తమిళనాడు): టీవీఎస్ శ్రీచక్ర డైరెక్టర్ విజయరాఘవన్ గుండెపోటుతో మరణించారు. విజయరాఘవన్ 21 ఏళ్ల వయసులో 1969 వ సంవత్సరంలో సుందరం ఇండస్ట్రీస్ లో చేరారు. టీవీఎస్ గ్రూప్ లో ఐదు దశాబ్దాల పాటు పనిచేసిన విజయరాఘవన్ టీవీఎస్ శ్రీచక్ర ప్రారంభం నుంచి దాని పురోగతిలో కీలకపాత్ర పోషించారు. ఖాతాదారుడే రాజు అనే నినాదంతో రబ్బరు టైర్ల పరిశ్రమలో పనిచేసిన విజయరాఘవన్ పలు పారిశ్రామిక సంస్థల్లో సభ్యుడిగా ఉన్నారు. విజయరాఘవన్ కు భార్య, కుమారుడు ఉన్నారు. మధురై, ఉత్తరాఖండ్ లలో టీవీఎస్ గ్రూప్ టైర్ల కర్మాగారాలను నెలకొల్పి 70 దేశాలకు టైర్లను ఎగుమతి చేశారు. 

Updated Date - 2020-07-09T15:09:12+05:30 IST