Abn logo
Oct 22 2021 @ 23:55PM

‘ఖని’ ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన టీవీవీఐసీ జీఎం

ఆసుపత్రి వద్ద పరిశీలిస్తున్న మహేశ్వర్‌

- వైద్య కళాశాలకు అనుబంధంగా 85 పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థల పరిశీలన

కళ్యాణ్‌నగర్‌, అక్టోబరు 22: రామగుండం మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా కొత్తగా 85 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఇండస్ర్టియల్‌ కార్పొరేషన్‌(టీవీవీఐసీ) జనరల్‌ మేనేజర్‌ మహేశ్వర్‌ స్థల పరిశీలన చేశారు. త్వరలోనే ఈ ఆసుపత్రి నిర్మాణా నికి శంకుస్థాపన చేయనున్నారు. వైద్య కళాశాల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పనులు వేగవంతమవుతున్నాయి. డిగ్రీ కళాశాలలో ఏర్పాటుకు స్థల సేకరణ కూడా చేశారు. వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ రమేష్‌రెడ్డి నెలరోజుల క్రితం ఇక్కడ మెడికల్‌ కళాశాల ఏర్పాటుపై సమీక్ష కూడా నిర్వహించారు. మహేశ్వర్‌ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కంది శ్రీనివాస్‌రెడ్డి, ప్రాజెక్టు ఇంజనీర్‌ సృ జన్‌, కన్సల్టెంట్‌ కిరణ్‌ ఉన్నారు.