ట్వీట్‌కు రిప్లై ఇక మీ ఇష్టం!

ABN , First Publish Date - 2020-08-15T05:35:50+05:30 IST

మీరు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెడితే ఎవరు పడితే వారు కామెంట్లు చేస్తుంటారు. రిప్లై ఇస్తుంటారు. కానీ ఇక ముందు అలాకాదు. మీ పోస్ట్‌లకు స్పందించే అవకాశాన్ని మీకు నచ్చిన వారికి మాత్రమే ఇవ్వొచ్చు...

ట్వీట్‌కు రిప్లై ఇక మీ ఇష్టం!

మీరు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెడితే ఎవరు పడితే వారు కామెంట్లు చేస్తుంటారు. రిప్లై ఇస్తుంటారు. కానీ ఇక ముందు అలాకాదు. మీ పోస్ట్‌లకు స్పందించే అవకాశాన్ని మీకు నచ్చిన వారికి మాత్రమే ఇవ్వొచ్చు. దాంతో వాళ్లు మాత్రమే రిప్లై ఇస్తారు. ట్విట్టర్‌ అలాంటి ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ ట్వీట్‌లకు ఎవరు రెస్పాండ్‌ కావాలో మీరే నిర్ణయించవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ట్విట్టర్‌.కామ్‌లో లేదా ట్విట్టర్‌ యాప్‌లో కంపోజ్‌ ట్వీట్‌ బటన్‌పై ట్యాప్‌ చేయాలి. తరువాత గ్లోబ్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి. ఇప్పుడు మీ ట్వీట్లకు ఎవరు రెస్పాండ్‌ కావాలో ఎంచుకోవాలి.


‘ఎవ్రీవన్‌’ ఎంచుకుంటే అందరూ స్పందించవచ్చు. ‘పీపుల్‌ యు ఫాలో’ ఆప్షన్‌ ఎంచుకుంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవారు మాత్రమే స్పందించగలుగుతారు. ‘ఓన్లీ పీపుల్‌ యు మెన్షన్‌’ ఎంచుకుంటే మీరు ఎంపిక చేసుకున్న వాళ్లు మాత్రమే మీ ట్వీట్లకు స్పందించే అవకాశం ఉంటుంది. ఈ సెట్టింగ్స్‌ను ఎంచుకున్నాక ట్వీట్‌ను కంపోజ్‌ చేసి పోస్ట్‌ చేస్తే చాలు.

Updated Date - 2020-08-15T05:35:50+05:30 IST