Abn logo
Oct 15 2021 @ 18:20PM

పన్నెండు రోజులు... రూ. 29 వేల కోట్ల షాపింగ్‌

న్యూఢిల్లీ : కేవలం పన్నెండు రోజుల్లో రూ. 29 వేల కోట్ల షాపింగ్‌... మన దేశంలోనే. వినాయకచవితి నుంచి దీపావళి వరకు సాగే అమ్మకాలు దేశంలోనే అతి పెద్ద షాపింగ్‌ సీజన్‌. సంవత్సరం మొత్తం చేసే షాపింగ్‌ ఖర్చులో సింహభాగం ఈ ఒక్క సీజన్‌లోనే లెక్కలోకి వస్తుంది. ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం... ఈ సీజన్‌లో ప్రజలు రూ. 29,121.45 కోట్లు ఖర్చు చేశారు. అది కూడా కేవలం పన్నెండు రోజుల్లోనే. ఇది నమ్మలేని నిజం. అక్టోబరు నెలలోని తొలి పన్నెండు  రోజుల్లో దేశ ప్రజలు ఇంత భారీ మొత్తాన్ని వ్యయం చేశారు. ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో, పాయింట్‌-ఆఫ్‌-సేల్‌ టెర్మినల్స్‌లో చేసిన ఖర్చు ఇది.


ఈ రూ. 29,121.45లో క్రెడిట్‌ కార్డ్‌ వాటా రూ. 19,817.35 కోట్లు కాగా, డెబిట్‌ కార్డ్ వాటా రూ. 9,304.10. పీఓఎస్  విషయానికొస్తే... క్రెడిట్‌ కార్డ్ వాటా రూ. 10,840 కోట్లుగా, డెబిట్‌ కార్డ్ వాటా రూ. 15781.60. పనీఓఎస్‌ల్లో క్రెడిట్‌ కార్డ్ కంటే డెబిట్‌ కార్డ్ ద్వారానే ఎక్కువ స్వైప్‌ చేశారు. సెప్టెంబరు నెలలో... ఈ-కామర్స్‌, PoSల్లో కలిపి, క్రెడిట్‌ కార్డ్ స్పెండింగ్స్‌ రూ.62,936.71 కోట్లుగా, డెబిట్‌ కార్డ్‌ స్పెండింగ్స్‌ 51,701 కోట్లుగా లెక్క తేలాయి.