సింగపూర్‌కు... మరో నాలుగేళ్ళ నాటికి... పన్నెండు లక్షల మంది ఉద్యోగులు అవసరం...

ABN , First Publish Date - 2021-03-01T00:45:54+05:30 IST

సింగపూర్‌కు మరో నాలుగేళ్ళలో... అంటే 2025 సంవత్సరం నాటికి 1.2 మిలియన్ల డిజిటల్ స్కిల్డ్ ఉద్యోగులు అవసరం. ఈ వివరాలను ఓ నివేదిక వెల్లడించింది.

సింగపూర్‌కు... మరో నాలుగేళ్ళ నాటికి... పన్నెండు లక్షల మంది ఉద్యోగులు అవసరం...

సింగపూర్ :  సింగపూర్‌కు మరో నాలుగేళ్ళలో... అంటే 2025 సంవత్సరం నాటికి 1.2 మిలియన్ల డిజిటల్ స్కిల్డ్ ఉద్యోగులు అవసరం. ఈ వివరాలను ఓ నివేదిక వెల్లడించింది. ఆస్ట్రేలియా, ఇండియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా దేశాల్లో అమెజాన్ వెబ్ సిరీస్ ఈ సర్వే నిర్వహించింది.


డిజిటల్ నైపుణ్యపరంగా ఎదురయ్యే సవాళ్లను ఉద్యోగులు భవిష్యత్తులో ఎలా ఎదుర్కోనున్నారనే కోణంలో చేపట్టిన ఈ సర్వే వివరాలిలా ఉన్నాయి. సర్వేలో భాగంగా మూడు వేల మంది నుంచి వివరాలను సేకరించారు.  ఇప్పటికే సింగపూర్‌లోని ప్రతీ పదిమంది ఉద్యోగుల్లో ఆరుగురు తమ విధుల్లో డిజిటల్ నైపుణ్యాలను వినియోగిస్తున్నారు. ఈ విషయంలో సింగపూర్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 64 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాలో ప్రతి ఐదుగురిలో ఒకరు (22 శాతం మంది వరకు) డిజిటల్ నైపుణ్యాన్ని వినియోగిస్తున్నారు. ఆరు దేశాల్లో ఇది అత్యధికం. ఆ తర్వాతి స్థానంలో 21 శాతంతో దక్షిణ కొరియా ఉంది.


పన్నెండు శాతం మందికే డిజిటల్ నైపుణ్యం...

భారత్‌లోని ఉద్యోగుల్లో 12 శాతం మందికి మాత్రమే డిజిటల్ స్కిల్స్ ఉన్నప్పటికీ, అడ్వాన్స్డ్ డిజిటల్ స్కిల్స్ కోసం అత్యధికంగా 71 శాతం మంది దరఖాస్తు చేసుకున్నారు. సింగపూర్ 59 శాతంతో మూడో స్థానంలో ఉంది. 


వీటికి డిమాండ్...

ఇప్పుడున్న వారితో కలిపి 2025 నాటికి సింగపూర్‌లోని ఉద్యోగులకు 2.38 కోట్ల డిజిటల్ స్కిల్ ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించాల్సి ఉంటుందని ఈ నివేదిక వెల్లడించింది. ఇక... భారత్ విషయానికొస్తే రానున్న అయిదేళ్లలో 39 కోట్ల ట్రైనింగ్ సెషన్స్ అవసరమని వెల్లడించింది. ఇక... 2020-2025 మధ్య భారత్‌తో పాటు, జపాన్, సింగపూర్ దేశాల్లోని డిజిటల్ స్కిల్డ్ సిబ్బందికి అడ్వాన్స్డ్‌ క్లౌడ్ స్కిల్స్‌కు డిమాండ్ ఎక్కువ అని తెలిపింది.

Updated Date - 2021-03-01T00:45:54+05:30 IST