Firozabad: డెంగీ జ్వరాలతో 12 మంది పిల్లల మృతి

ABN , First Publish Date - 2021-08-30T13:44:40+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో వైరల్, డెంగీ జ్వరాలతో 12 మంది పిల్లలు మరణించిన ఘటన ఆందోళన కలిగిస్తోంది....

Firozabad: డెంగీ జ్వరాలతో 12 మంది పిల్లల మృతి

ఆగ్రా (ఉత్తర్ ప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో వైరల్, డెంగీ జ్వరాలతో 12 మంది పిల్లలు మరణించిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. జ్వరాలతో 12 మంది పిల్లలు మరణించిన ఘటనతో ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్వరాలతో 12మందికి పైగా పిల్లలు మరణించారని స్థానికులు చెబుతుండగా, తాము జరిపిన విచారణలో 8 మంది పిల్లలే మరణించారని ఆరోగ్య శాఖ చెబుతోంది.వాస్తవానికి ఫిరోజాబాద్ జిల్లా గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నగ్లా అమన్, కాపావలి గ్రామాల్లో జ్వరాలతో కేవలం మూడు రోజుల్లో 24 మంది మరణించారని వెల్లడైంది. 


ఆరోగ్యశాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల డెంగీ జ్వరాలతో మరణిస్తున్న పిల్లల సంఖ్య పెరిగిందని స్థానికులు ఆరోపించారు.శనివారం ఒక్కరోజే 12 మంది పిల్లలు మరణించారు. 4 నుంచి 17 ఏళ్ల వయసుగల పిల్లలు జ్వరాలతో మరణించారు. కాగా జ్వరాలతో కేవలం 8 మంది పిల్లలే మరణించారని ఫిరోజాబాద్ డాక్టర్ నీతా కుల్ శ్రేష్ట చెప్పారు. తీవ్ర జ్వరం, డెంగీతో పిల్లలు ఆసుపత్రుల్లో చేరుతున్నారని హిందుస్థానీ బిరాదరి ఉపాధ్యక్షుడు విశాల్ శర్మ చెప్పారు. ఆగ్రా, ఫిరోజాబాద్, మధుర, మెయిన్ పురి, ఈటా, కసగంజ్ జిల్లాల్లో పిల్లలు జ్వరాలతో వణుకుతున్నారు.


Updated Date - 2021-08-30T13:44:40+05:30 IST