Advertisement
Advertisement
Abn logo
Advertisement

shocking: ఆ 28 ఏళ్ల యువకుడు 100కుపైగా కేసుల్లో నిందితుడని తెలిసి పోలీసులే షాకయ్యారు.. ఇంతకీ ఆ యువకుడు ఎవరంటే..!

న్యూఢిల్లీ: టీవీ షో ఇండియన్ ఐడల్‌ కంటెస్టెంట్, తైక్వాండో ప్లేయర్ అయిన సూరజ్ బహదూర్ వందకు పైగా చైన్ స్నాచింగులకు పాల్పడ్డాడని తేలడంతో పోలీసులే షాక్ కు గురయ్యారు.టీవీ షో ఇండియన్ ఐడల్‌లో పాల్గొన్న 28 ఏళ్ల యువకుడు, జాతీయ స్థాయి రెండుసార్లు బంగారు పతక విజేత, తైక్వాండో ప్లేయర్ సూరజ్ బహదూర్ 100 కి పైగా స్నాచింగ్, దోపిడీ కేసుల్లో పాల్గొన్నందుకు పశ్చిమ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ పరిధిలోని వికాస్ నగర్ నివాసి అయిన సూరజ్ ఢిల్లీలోని మోతీనగర్ ప్రాంతంలో స్కూటరుపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. 

సూరజ్ నడుపుతున్న స్కూటరు కీర్తినగర్ ప్రాంతంలో చోరీ చేశాడని పోలీసుల తనిఖీల్లో తేలింది. నిందితుడు సూరజ్ ఉత్తర ఢిల్లీలోని సబ్జిమండీ పోలీసుస్టేషను పరిధిలో పలు మొబైల్ ఫోన్లను స్నాచింగ్ చేసినట్లు తేలింది. 2.5 కిలోల బంగారు ఆభరణాలను సూరజ్ దోచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు సూరజ్ టీవీ షో ఇండియన్ ఐడల్‌ కంటెస్టెంట్ అయిన  తైక్వాండో ప్లేయర్ సూరజ్ బహదూర్ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వందకు పైగా స్నాచింగులకు పాల్పడినట్లు అంగీకరించాడు. 

నిందితుడి వద్ద నుంచి దేశీయ పిస్టల్,తూటాలు, 55 మొబైల్ ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.సూరజ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇతను తైక్వాండోలో రెండుసార్లు జాతీయ స్వర్ణ పతక విజేత. నిందితుడు సూరజ్ మంచి గాయకుడు కావడంతో 2008 లో ఇండియన్ ఐడల్ సీజన్ 4 లో పాల్గొని టాప్ 50 పోటీదారుల్లో ఒకరిగా నిలిచాడు.  


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement