ఢిల్లీ ఆసుపత్రిలో మహిళా రోగిపై అఘాయిత్యం

ABN , First Publish Date - 2020-10-29T13:14:27+05:30 IST

ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి...

ఢిల్లీ ఆసుపత్రిలో మహిళా రోగిపై అఘాయిత్యం

గురుగ్రామ్ : ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం జరిపిన దారుణ ఘటన గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసింది. గురుగ్రామ్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరింది. తాను వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు  ఆసుపత్రి ఉద్యోగి  ఒకరు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపింది. ఈ ఘటన ఈ నెల 21 నుంచి 27 వతేదీ మధ్య జరిగిందని, స్పృహలోకి వచ్చాక బాధిత యువతి సంఘటన గురించి చెప్పిందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.బాధిత యువతి ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 


 మహేంద్రనగర్ ప్రాంతానికి చెందిన యువతి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ క్షయవ్యాధికి చికిత్స పొందేందుకు ఐసీయూలోని ఓ ప్రైవేటు గదిలో చేరిందని పోలీసులు చెప్పారు.రోగిని కలిసేందుకు వచ్చిన తండ్రికి బాధిత యువతి రాతపూర్వకంగా తెలిపిందని ఏసీపీ ఉషా కుండు చెప్పారు. ఈ ఘటనపై సుశాంత్ లోక్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 376(2)ఇ కింద కేసు నమోదు చేసి, నిందితుడిని గుర్తించామని ఏసీపీ చెప్పారు. ఈ కేసులో ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వికాస్ అని, తాము ఆసుపత్రి ఉద్యోగులను ప్రశ్నిస్తున్నామని ఏసీపీ వివరించారు. తన కుమార్తె ఉన్న గదిలోకి పురుష సిబ్బందిని ఎలా పంపిస్తారని బాధిత యువతి తండ్రి ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులకు తాము సహకరిస్తామని ఫోర్టిస్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. 

Updated Date - 2020-10-29T13:14:27+05:30 IST