Japan దేశంలో ఘోర అగ్నిప్రమాదం...27మంది దుర్మరణం

ABN , First Publish Date - 2021-12-17T14:59:00+05:30 IST

జపాన్ దేశంలో శుక్రవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27మంది మరణించారు....

Japan దేశంలో ఘోర అగ్నిప్రమాదం...27మంది దుర్మరణం

ఒసాకా (జపాన్): జపాన్ దేశంలో శుక్రవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27మంది మరణించారు. ఒసాకా నగరంలోని ఓ 8 అంతస్తుల షాపింగ్ మాల్ భవనంలో మంటలు చెలరేగాయి. షాపింగ్ మాల్ 5వ అంతస్తులో జరిగిన అగ్నిప్రమాదంలో 27 మంది గుండె, ఊపిరితిత్తుల వైఫల్యంతో మరణించారని జపాన్ అధికారులు చెప్పారు. షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం జరిగినపుడు భవనంలో 28 మంది ఉన్నారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగి మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదంలో కాలి మరణించారు. భవనంలో నుంచి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.


Updated Date - 2021-12-17T14:59:00+05:30 IST