హర్యానాలో గంటలో రెండుసార్లు భూప్రకంపనలు

ABN , First Publish Date - 2020-05-30T11:51:08+05:30 IST

కేవలం గంట సమయంలో శుక్రవారం రాత్రి రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలు చెందిన ఘటన...

హర్యానాలో గంటలో రెండుసార్లు భూప్రకంపనలు

 న్యూఢిల్లీ : కేవలం గంట సమయంలో శుక్రవారం రాత్రి రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలు చెందిన ఘటన హర్యానా రాష్ట్రంలోని రోహతక్, ఢిల్లీ ప్రాంతాల్లో వెలుగుచూసింది.  హర్యానా రాష్ట్రంలోని రోహతక్ కేంద్రంగా ఢిల్లీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి రెండు సార్లు భూకంపం సంభవించింది. హర్యానా రాష్ట్రంలోని రోహతక్ నగరం కేంద్రంగా శుక్రవారం రాత్రి 9.08 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలాజీ వెల్లడించింది. ఢిల్లీ పరిసరప్రాంతాల్లో 50 కిలోమీటర్ల మేర వచ్చిన భూకంపం 5 కిలోమీటర్ల లోతు నుంచి వచ్చింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు రెండోసారి భూకంపం సంభవించింది. రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.9 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలాజీ పేర్కొంది. ఢిల్లీ ప్రాంతంలో ఈ నెలలో నాలుగుసార్లు భూమి కంపించింది. ఫరీదాబాద్ జిల్లాలో గురువారం భూమి కంపించింది. మే 15న ఢిల్లీలో భూమి కంపించింది. మే 10 వతేదీన ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. కరోనా భయంతో అల్లాడుతున్న ప్రజలు భూప్రకంపనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. 

Updated Date - 2020-05-30T11:51:08+05:30 IST