చరిత్రలో తొలిసారి.. కవలల సెక్స్ మార్పిడి!

ABN , First Publish Date - 2021-02-25T09:58:13+05:30 IST

ఇటీవలి కాలంలో కొంత మంది సెక్స్ మార్పిడి చేయించుకున్నారంటూ తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంది కవలలు. బ్రెజిల్‌కు చెందిన మేలా, సోఫియా అనే ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలుగా మారాలని డిసైడ్ అయ్యారు.

చరిత్రలో తొలిసారి.. కవలల సెక్స్ మార్పిడి!

బ్రజీలియా: ఇటీవలి కాలంలో కొంత మంది సెక్స్ మార్పిడి చేయించుకున్నారంటూ తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంది కవలలు. బ్రెజిల్‌కు చెందిన మేలా, సోఫియా అనే ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలుగా మారాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవుగా సెక్స్ మార్పిడి శస్త్రచికిత్స చేయించేసుకున్నారు. ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్ దీని గురించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ చాలామంది ఇలా సెక్స్ మార్పిడి చేయించుకున్నారని, కానీ ఇలా ఇద్దరు కవలలు ఈ శస్త్రచికిత్స చేయించుకోవడం చరిత్రలో ఇదే తొలిసారని అన్నారు.


ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఆపరేషన్ చేసినట్లు వార్తలు రాలేదని ఆయన తెలిపారు. మేలా, సోఫియా ఇద్దరూ పుట్టినప్పుడు అబ్బాయిలే. 19 ఏళ్ల ఈ కవలలు తాము ఎప్పుడూ అబ్బాయిల్లా అనుకోలేదని, అమ్మాయిల్లానే పెరిగామని అన్నారు. అందుకే ఈ ఆపరేషన్ చేయించుకున్నారట.

Updated Date - 2021-02-25T09:58:13+05:30 IST