Amazon Twitchపై హ్యాకర్ దాడి....డేటా లీక్

ABN , First Publish Date - 2021-10-07T22:07:54+05:30 IST

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ డాట్ కామ్ ఇంక్స్ ఈ-స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ‘ట్విచ్‌’పై సైబర్ దాడి జరిగింది. ట్విచ్ డేటా మొత్తం

Amazon Twitchపై హ్యాకర్ దాడి....డేటా లీక్

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ డాట్ కామ్ ఇంక్స్ ఈ-స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ‘ట్విచ్‌’పై సైబర్ దాడి జరిగింది. ట్విచ్ డేటా మొత్తం లీకైంది. హ్యాకర్ దాడిని ట్విచ్ కూడా నిర్ధారించింది. అయితే, అంతకుమించిన వివరాలను వెల్లడించలేదు. ‘వీడియో గేమ్స్ క్రోనికల్’ ప్రకారం ట్విచ్ సోర్స్ కోడ్, క్లయింట్స్, విడుదలకాని గేమ్స్‌కు సంబంధించిన వివరాలు సహా ట్విచ్ డేటా మొత్తాన్ని గుర్తు తెలియని హ్యాకర్ లీక్ చేశాడు.


హ్యాకర్ దాడిని నిర్ధారించిన ట్విచ్ దీనిపై తమ బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నట్టు పేర్కొంది. ఇది ఎలా జరిగిందన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. అయితే, అంతకుమించిన వివరాలను వెల్లడించేందుకు నిరాకరించింది. మరింత సమాచారం లభించిన వెంటనే తెలియజేస్తామని చెప్పింది. మరోవైపు అమెజాన్ ఇప్పటి వరకు స్పందించలేదు. అభివృద్ధిని అడ్డుకోవడం, ఆన్‌లైన్ వీడియో స్పేస్‌లో పోటీ పెంచడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. 


2019 నుంచి ట్విచ్ అత్యధిక చెల్లింపు వీడియో గేమ్ స్ట్రీమర్‌ల సమాచారం సహా దాదాపు 125 జీబీల డేటా లీక్ అయినట్టు సమాచారం. వాయిస్ యాక్టర్లకు 9.6 మిలియన్ డాలర్లు చెల్లించిన పాపులర్ గేమ్ ‘డన్జియన్స్ అండ్ డ్రాగన్స్’, కెనడియన్ స్ట్రీమర్ xQcOWకు 8.4 మిలియన్ డాలర్లు చెల్లించిన వివరాలు కూడా ఇందులో ఉన్నట్టు సమాచారం.


చెప్పుకోగదగ్గ వ్యక్తిగత డేటాతోపాటు ట్విచ్ లీకేజీ నిజమేనని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు కెవిన్ బీమౌంట్ ట్వీట్ చేశారు. ట్విచ్ అనేది ఆన్‌లైన్ ఈ-స్పోర్ట్స్ ఫ్లాట్‌ఫామ్. దీనికి రోజువారీ విజిటర్లు 30 మిలియన్లను పైనే ఉన్నారు.  

Updated Date - 2021-10-07T22:07:54+05:30 IST