భాషా వివాదంలో ‘జొమోటో’.. బాయ్‌కాట్ అంటూ ట్రెండింగ్

ABN , First Publish Date - 2021-10-19T22:52:05+05:30 IST

తమిళనాడు కేంద్రం కొనసాగిన హిందీ వ్యతిరేక ఉద్యమం ప్రభావం కాబోలు.. చాలా సందర్భాల్లో తమిళనాడు నుంచి హిందీ వ్యతిరేకత చాలా ఎక్కువ సార్లు, ఎక్కువగా కనిపిస్తుంటుంది. అనేక సందర్భాల్లో తమిళులు ఇలాగే స్పందించారు. ఆ మధ్య ఒకసారి అయితే ‘హిందీ తెలియదు పోరా’ అనే నినాదం సంచలనంగా మారింది...

భాషా వివాదంలో ‘జొమోటో’.. బాయ్‌కాట్ అంటూ ట్రెండింగ్

న్యూఢిల్లీ: ఒక కస్టమర్‌తో ‘హిందీ తప్పనిసరిగా రావాలి, అది జాతీయ భాష’ అని జొమాటో కస్టమర్ సెంటర్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగింది. తమ భాషను చిన్నచూపు చూస్తున్నారని, వ్యాపారం చేసేవాళ్లు కూడా హిందీ భాష ఆధిపత్య అహంకారంతో వ్యవహరిస్తున్నారంటూ జొమాటోపై దుమ్మెత్తిపోస్తున్నారు. తమిళనాడు కేంద్రంగా ప్రారంభమైన ఈ వివాదంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన చాలా మంది నెటిజెన్లు పాలు పంచుకుంటున్నారు. ‘హిందీ జాతీయ భాష’ కాదంటూ ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ‘బాయ్‌కాట్ జొమాటో’ అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


తమిళనాడు కేంద్రం కొనసాగిన హిందీ వ్యతిరేక ఉద్యమం ప్రభావం కాబోలు.. చాలా సందర్భాల్లో తమిళనాడు నుంచి హిందీ వ్యతిరేకత చాలా ఎక్కువ సార్లు, ఎక్కువగా కనిపిస్తుంటుంది. అనేక సందర్భాల్లో తమిళులు ఇలాగే స్పందించారు. ఆ మధ్య ఒకసారి అయితే ‘హిందీ తెలియదు పోరా’ అనే నినాదం సంచలనంగా మారింది. ఆ తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడం ఇదే తొలిసారి. నిజానికి ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ సంస్థతో జరిగిన వివాదం ఏదైనప్పటికీ తమిళుల భాషాభిమానాన్ని పరీక్షించినందుకు కాబోలు.. జొమాటోపై కాకుండా హిందీపై వ్యతిరేకతను ఎక్కువగా చూపిస్తున్నారు.

Updated Date - 2021-10-19T22:52:05+05:30 IST