Abn logo
Apr 9 2020 @ 03:09AM

ట్విటర్‌ సీయీవో విరాళం 7,600 కోట్లు

సాన్‌ ఫ్రాన్సిస్కో, ఏప్రిల్‌ 8: ప్రపంచవ్యాప్తంగా కరోనా నివారణ గాను చేపడుతున్న చర్యలకు మద్దతుగా ట్విటర్‌ సీయీవో జాక్‌ డోర్సీ దాదాపు రూ. 7,600 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తం జాక్‌ డోర్సీ ఆస్తిలో 28 శాతం కావడం గమనార్హం. ఈ డబ్బును తమ  సేవా సంస్థ స్టార్ట్‌ స్మాల్‌కు తరలించారు. ఈ మొత్తం నిధులను తన డిజిటల్‌ పేమెంట్‌ సంస్థ స్క్వేర్‌ నుంచే ఇవ్వడం గమనార్హం. ‘‘జీవితం చాలా చిన్నది. ఇతరుల కోసం మనం చేయగలిగినంతా చేద్దాం. ఈ చర్య మరింత మందికి ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నా’’ అని ఆయన ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత బాలికల విద్య, ఆరోగ్యంపై దృష్టి సారిస్తానని ఆయన చెప్పారు.


Advertisement
Advertisement
Advertisement