మీకు తెలుసా.. తందూరీతో కరోనాకు చెక్! డౌటొద్దు..నమ్మండి!

ABN , First Publish Date - 2020-03-27T00:51:06+05:30 IST

కరోనా పుణ్యమా అని నెటిజన్లకు బోలెడంత తీరికి దొరికింది. బిజీగా ఉన్నప్పుడే ట్విటర్‌లో కితకితలు పెట్టే వీరు ఇంత ఖాళీ దొరికితే ఊరుకోరు కదా? ఛలోక్తులు, హాస్యోక్తుల రూపంలో రచ్చ రచ్చ చేస్తారు. ఇక ప్రస్తుతం సమయంలో అన్ని జోకులు కరోనా చుట్టే తిరుగుతున్నాయి. తాజాగా కరోనాకు పరిస్కారమైన ‘సామాజిక దూరం’ విధానంపై నెటిజన్ల దృష్టి పడింది.

మీకు తెలుసా.. తందూరీతో కరోనాకు చెక్! డౌటొద్దు..నమ్మండి!

న్యూడిల్లీ: కరోనా పుణ్యమా అని నెటిజన్లకు బోలెడంత తీరిక దొరికింది. బిజీగా ఉన్నప్పుడే ట్విటర్‌లో కితకితలు పెట్టే వీరు ఇంత ఖాళీ దొరికితే ఊరుకోరు కదా? ఛలోక్తులు, హాస్యోక్తులతో రచ్చ రచ్చ చేస్తారు. ఇక ప్రస్తుత సమయంలో అన్ని జోకులు కరోనా చుట్టూనే తిరుగుతున్నాయి. తాజాగా కరోనాకు పరిస్కారమైన ‘సామాజిక దూరం’ విధానంపై నెటిజన్ల దృష్టి పడింది. దీంతో మరోసారి ట్విటర్‌లో నవ్వులపువ్వులు పూస్తున్నాయి. 


‘సామాజిక దూరం’ విధానాన్ని ఆంగ్లంలో సోషల్ డిస్టెన్సెంగ్ అంటారు. తెలుగు లో ఏమంటారో మనకు తెలిసిందే.  హిందీలో మాత్రం ఇప్పటి వరకూ ఆంగ్ల పదాన్నే యథాతథంగా వాడుతున్నారు. మరి ఇది కరెక్టు కాదనుకున్నారో ఏమో కానీ నెటిజన్లు..ఈ ఆంగ్ల పదానికి సమానార్థం ఇచ్చే ఓ హిందీ పదాన్ని వెతికిపట్టుకున్నారు. అదే తందూరీ.. అవును తందూరీనే. ఏంటి అర్థం కాలేదా? హిందీలో తన్ అంటే దేహం. దూరీ అంటే దూరాన్ని పాటించడం. ఈ రెండు పదాల్నీ కలిపితే..తందూరీ. అంటే దేహాల మధ్య దూరంతో కరోనా మాయం. సో.. ఈ విధంగా కరోనాకు తందూరీ చెక్ పెడుతుందన్న మాట.


Updated Date - 2020-03-27T00:51:06+05:30 IST