కరోనా ఎఫెక్ట్: ఏకంగా దేశాధ్యక్షుడికే ఝలకిచ్చిన ట్విటర్

ABN , First Publish Date - 2020-03-30T21:55:53+05:30 IST

బ్రెజిల్ అధ్యక్షుడి ఖాతాల నుంచి వీడియోలను తొలగించిన ట్విటర్

కరోనా ఎఫెక్ట్: ఏకంగా దేశాధ్యక్షుడికే ఝలకిచ్చిన ట్విటర్

సావో పావ్‌లో: కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెయిర్ బోల్సొనారో ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. రకరకాల మాధ్యమాల ద్వారా ఈ చర్యలను ఖండిస్తున్నారు. ఈ ఆంక్షలను త్యజించాలని, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థను కాపాడాలని ఇటీవలే తన మద్దతుదారులకు ఆయన పిలుపునిచ్చారు. ఒకానొక సందర్భంలో వారితో పాటూ తాను కూడా సామాజిక దూరం పాటించాలన్న నిబంధనను తుంగలోకి తొక్కి విధుల్లోకి వచ్చి ప్రదర్శనలిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ట్విటర్‌లో కూడా  షేర్ చేశారు. అయితే.. ఇది ట్విటర్ యాజమాన్యానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో వెంటనే ట్విటర్.. ఈ వీడియోలను అధ్యక్షుడి అకౌంట్ నుంచి తొలగించింది. సంస్థ నిబంధనలను ఈ వీడియోలను ఉల్లఘించాయంటూ నిక్కచ్చిగా ప్రకటించిన ట్విటర్ మరో ఆలోచన లేకండా అధ్యక్షుడి వీడియోలను తొలగించి ఆయనకు పెద్ద ఝలక్ ఇచ్చింది.  

Updated Date - 2020-03-30T21:55:53+05:30 IST