కొవిడ్‌ బాధితులకు తక్షణ వైద్యం కోసం...

ABN , First Publish Date - 2021-05-12T07:18:28+05:30 IST

ఆక్సిజన అత్యవసరమై ప్రభుత్వాసుపత్రి వద్ద నిరీక్షిస్తున్న కొవిడ్‌ బాధితులకు తక్షణ వైద్య సేవలు అందజేయడానికి ‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ పేరుతో రెండు ఆర్టీసీ ఏసీ బస్సులను సిద్ధం చేశామని, వీటిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద బుధవారం ప్రారంభిస్తామని ఎంపీ మార్గాని భరతరామ్‌ వెల్లడించారు.

కొవిడ్‌ బాధితులకు తక్షణ వైద్యం కోసం...

  • ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన పడకలు
  • నేడు ప్రభుత్వాసుత్రి వద్ద ప్రారంభం

రాజమహేంద్రవరం అర్బన, మే 11: ఆక్సిజన అత్యవసరమై ప్రభుత్వాసుపత్రి వద్ద నిరీక్షిస్తున్న కొవిడ్‌ బాధితులకు తక్షణ వైద్య సేవలు అందజేయడానికి ‘జగనన్న ప్రాణవాయువు రథచక్రాలు’ పేరుతో రెండు ఆర్టీసీ ఏసీ బస్సులను సిద్ధం చేశామని, వీటిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద బుధవారం ప్రారంభిస్తామని ఎంపీ మార్గాని భరతరామ్‌ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్జీవోల ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నామని, ఇప్పటికే రెండు, మూడు చోట్ల ట్రయల్‌రన నిర్వహించగా విజయవంతమైందన్నారు. కాకినాడ డిపోకు చెందిన ఈ రెండు వెన్నెల ఏసీ బస్సుల్లో 60 స్లీపర్‌ బెర్తులు ఉంటాయి. ఇవి మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం డిపోకు చేరుకున్నాయని రీజనల్‌ మేనేజరు నాగేశ్వరరావు తెలిపారు. 

 

Updated Date - 2021-05-12T07:18:28+05:30 IST