పట్నా: బీహార్‌లోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో సోమవారం వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు ఎఎన్ఎంలు అనారోగ్యం పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను బెతియా ఆసుపత్రికి తరలించారు. మరో ఎఎన్ఎంకు రామ్‌నగర్ పీహెచ్సీలో చికిత్స అందిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేశామని తెలిపారు. అయితే ఈ టీకా తీసుకున్న తరువాత ఇద్దరు ఏఎన్ఎంల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. ప్రస్తుతం వారిద్దరికీ వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు.