Abn logo
Apr 6 2021 @ 07:47AM

మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఇద్దరు అరెస్టు

హైదరాబాద్/హైదర్‌నగర్‌ : మద్యం మత్తులో కూకట్‌పల్లి జాతీయ రహదారిపై వీరంగం సృష్టించి సోడా బండిని ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పీఎన్‌ఆర్‌ కాంప్లెక్స్‌ వద్ద నల్లసంతల ముత్తు ఆదివారం సోడాలు విక్రయిస్తుండగా సాయంత్రం 6గంటలకు టీఎస్09ఈయు7477 నెంబరు గల కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు మద్యంలో కలుపుకునేందుకని నీళ్లడిగి ముత్తుతో గొడవకు దిగారు. ముత్తుపై చేయిచేసుకున్న వ్యక్తులు సోడా బండిని కూడా ధ్వంసం చేశారు. విషయాన్ని పోలీసులకు తెలుపగా ఇద్దరు వ్యక్తులను డా.అరుణ్‌, శ్రీనివా్‌సలుగా గుర్తించారు. వారికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష నిర్వహించగా మద్యం తాగినట్లు తేలింది. ముత్తు ఇచ్చిన ఫిర్యాదుపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఐఏఎస్‌, ఐపీఎస్‌ కాలనీకి చెందిన గొర్రి అరుణ్‌ కుమార్‌, తార్నాకలోని కృష్ణ రెసిడెన్సీకి చెందిన మేక శ్రీనివాస్‌ యాదవ్‌లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితులలో ఒకరు పోలీస్‌ ఉన్నతాధికారి కుమారుడిగా భావిస్తున్నా పోలీసులు మాత్రం ఈ విషయంపై పెదవి విప్పటం లేదు.

Advertisement
Advertisement
Advertisement