Abn logo
Sep 25 2021 @ 00:32AM

నకిలీ నోట్ల చలామణిలో ఇద్దరు అరెస్ట్‌

గుత్తి, సెప్టెంబరు 24: పట్టణంలో నకిలీ నోట్ల చలామణికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి, వారి  నుంచి  నోట్ల తయారీకి ఉపయోగించే నల్లపేపర్ల బండిల్స్‌, కెమికల్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాము తెలిపారు. శుక్రవా రం ఆయన విలేకరులకు అరెస్ట్‌ వివరాలు వెల్లడించారు. క ర్నూలు జిల్లాకు చెందిన సలీమ్‌, మల్లికార్జున కలిసి పెద్దవడుగూరు మండలం గ్రామానికి చెందిన సుధాకర్‌కు రూ. లక్ష ఒరిజినల్‌ నోట్లు ఇస్తే లక్షల్లో నకిలీ నోట్లు ఇస్తామని బేరం కుదుర్చుకున్నార న్నారు. గురువారం కొత్తపేట ఫ్లైఓవర్‌ వద్ద  నోట్ల మార్పిడి జరుగుతుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. కాని వారు నకిలీ నోట్లు తేలేదన్నారు. నల్లటి పేపర్‌ను కట్‌ చేసి దా న్నే నోట్లుగా చూపించి సుధాకర్‌ను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చినట్లు తెలిపారన్నారు. రెండు కెమికల్‌ బాటిళ్లు, 30 బండిళ్ల నల్ల పేపర్లు, ఆరు కర్ణాటక టెట్రా పాకెట్లను సీజ్‌ చేశామన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారన్నారు.


రంగురాళ్లతో మోసం చేస్తున్న ఇద్దరు కూడా..

పెళ్లికాని వారిని గుర్తించి, వారికి తొందరగా పెళ్లి జరగా లంటే తామిచ్చిన రాయి దగ్గరుంచుకోవాలని మోసం చేస్తున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్ల సీఐ రాము తెలిపారు. తాడిపత్రికి చెందిన వేణుగోపాల్‌ పెళ్లిళ్ల పేరయ్యగా జీవ నం సాగిస్తున్నాడన్నారు. అధికంగా డబ్బులు సంపాదిం చాలనే ఆశతో ఎక్కువ వయస్సు ఉండి వివాహం కాని వారికి దోషం ఉందని చెప్పి తన దగ్గరున్న రాయిని ఉంచుకుంటే తొందరగా పెళ్లి అవుతుందని నమ్మించి మోసం చేస్తున్నాడన్నారు. డోనకు చెందిన సోమేష్‌ అనే వ్యక్తి వద్ద నుంచి రంగురాళ్లను తీసుకుని వస్తున్నాడన్నారు. గురువా రం డోనలో సోమేష్‌ వద్ద రంగురాళ్లను తీసుకుంటుండగా డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. 45 రంగురాళ్లు, ఐదు కర్ణాటక టెట్రా పాకెట్లును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమో దు చేసి శుక్రవారం కోర్టుకు  హాజరుపరచగా  రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు సుధాకర్‌ యా దవ్‌, మురారిబాబు పాల్గొన్నారు.