యూపీలో మరో దారుణం...

ABN , First Publish Date - 2020-10-06T12:52:19+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది....

యూపీలో మరో దారుణం...

బాలికపై అత్యాచారం చేసి, వీడియో చిత్రీకరించారు

మీరట్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఇద్దరు యువకులు 15 ఏళ్ల వయసు గల బాలికను ఎత్తుకెళ్లి, ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి, దాన్ని వీడియో చిత్రీకరించిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో వెలుగుచూసింది. మీరట్ నగరంలోని సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ఆమె బంధువులైన ఇద్దరు యువకులు తీసుకువెళ్లి ఆమెకు మత్తుమందు ఇచ్చారు. స్పృహ కోల్పోయిన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశారని ఏఎస్పీ సూరజ్ రాయ్ చెప్పారు. బాధిత బాలికను వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఈ కేసులో నిందితులైన ఇద్దరు యువకులను అరెస్టు చేశామని ఏఎస్పీ సూరజ్ రాయ్ చెప్పారు. 

Updated Date - 2020-10-06T12:52:19+05:30 IST